సబ్సిడీ,వ్యవసాయ యంత్ర పరికరాముల పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి 

సబ్సిడీ,వ్యవసాయ యంత్ర పరికరాముల పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి 

వేలేరు, మార్చ్ 09 (తెలంగాణ ముచ్చట్లు):

ధర్మసాగర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ  కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం హన్మకొండ జిల్లా పరిధిలోని ధర్మసాగర్, వేలేరు మండలాలకు సంబందించిన 12మంది లబ్ధిదారులకు 50శాతం సబ్సిడీపై రోటవెటర్స్, బేయిలర్స్, స్ప్రేయర్స్ వంటి వ్యవసాయ పనిముట్లను లబ్ధిదారులకు పంపిణి చేశారు.అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ
ధర్మసాగర్, వేలేరు మండలాలు పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడిన మండలాలని కావున సబ్సిడీ యంత్రాల కేటాయింపులో ఈ రెండు మండలాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారులను కోరారు. డ్రోన్ స్ప్రేయర్స్ లను వ్యక్తులకు కాకుండా రైతు సంఘాలకు గాని, మహిళా సంఘాలకు గాని గ్రామానికి ఒకటి చొప్పున కేటాయించాలని అన్నారు. ప్రభుత్వాలు రైతులకు ఎంత చేసినా తక్కువే నని రైతులు పండించిన పంట చేతికి వచ్చిన నోటికి రావడం లేదని అన్నారు. ఎన్ని చేసినా వ్యవసాయం లాభసాటిగా మారడం లేదని తెలిపారు. స్వామినాధన్ కమిషన్ నివేదిక ను యథాతదంగా అమలు చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఏడిఏవో, ఏవోలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.IMG-20260309-WA0267

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .