ఆడదానికి మాత్రమే పరువు?

ఆడదానికి మాత్రమే పరువు?

ఆడదానికి మాత్రమే పరువు?


ఈ ఆధునిక కాలంలో కూడా
అమ్మాయి అంటే
వంటగది  పడకగది మధ్యే
ఆమె ప్రపంచమని
ఇంకా నమ్మే మనుషులు ఉన్నారు.

చదువు కోసం ఖర్చు పెట్టని తండ్రి,
పెళ్లి కోసం అప్పు తెచ్చి
ఆమె జీవితాన్నే తాకట్టు పెట్టే
ఈ సమాజం ఎంత వింత.

పుస్తకాలకు ఖర్చు పెట్టని చేతులే
పసుపు బొట్టుకు బరువు కడతాయి,
ఆమె కలల్ని కాదు,
ఆమె కట్నాన్ని లెక్కించే
లెక్కల సమాజం ఇది.

మహిళా దినోత్సవం నాడు
ఉపన్యాసాలు…
వాట్సాప్ స్టేటస్‌లు…
స్త్రీ శక్తి అని పెద్ద పెద్ద మాటలు…

కానీ ఇంట్లోకి అడుగుపెట్టగానే
నువ్వు ఆడదానివి అని
కట్టుబాట్ల గొలుసులు,
సంప్రదాయం పేరుతో
స్వేచ్ఛకి తాళాలు.

పరువు ఆచారం సంప్రదాయం…
ఈ మూడు పదాలు
అమ్మాయి మెడలోనే ఎందుకు తగులుతాయి?

అబ్బాయిలకు పరువు లేదా?
అబ్బాయిలకు సంప్రదాయం లేదా?
అబ్బాయిల తప్పులు
స్వేచ్ఛగా తిరిగే గాలిలా,
అమ్మాయిల తప్పులు
జీవిత ఖైదులా ఎందుకు?

ఆమె నవ్వు కూడా
అనుమతితోనే రావాలి,
ఆమె మాట కూడా
గోడల మధ్యే ఉండాలి.

వాడి పేరే వారసత్వం
పొలాలు, పత్రాలు,
ఆమె పేరు మీద
పెళ్లి పల్లకీ, పరువు బరువా?


ఇద్దరు ఒకే విర్యపు బొట్టునుంచి
మొలిచిన విత్తనాలే కదా,
ఇద్దరు ఒకే గర్భంలో
పెరిగిన ప్రాణాలే కదా.


వారసత్వం అనే మాటను
పురుషుడి జేబులో పెట్టి,
స్త్రీకి కేవలం
సంబంధాల చిరునామా ఇచ్చే
ఈ సమాజం న్యాయాన్ని తాకట్టు పెట్టి,
సంప్రదాయానికి కిరీటం పెట్టింది!

రెక్కలున్న పక్షిని
పంజరంలో పెట్టి
ఎగరలేదే అని
నవ్వే సమాజం ఇది.

 


~ బసడ సంపత్ యాదవ్ ✍🏻

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .