మహిళలే సమాజానికి శక్తి – మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగినుల ఘన సన్మానం
స్టేషన్ ఘనపూర్, మార్చి 9 (తెలంగాణ ముచ్చట్లు):
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనపూర్ స్టేషన్ మున్సిపాలిటీ పరిధిలోని మండల విద్యా వనరుల కేంద్రంలో మహిళా ఉద్యోగినులను ఘనంగా సన్మానించారు. ముదిరాజ్ యువజన సంక్షేమ సంఘం, శివునిపల్లి అధ్యక్షులు గోరంట్ల యాదగిరి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా సంఘం మహిళా అధికార ప్రతినిధి శ్రీమతి గోరంట్ల నాగరాణి ముదిరాజ్ తో కలిసి మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి కొమురయ్య మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి ఆధారం, సమాజానికి స్పూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. మహిళల సహనం, ప్రేమ, త్యాగం, సేవా భావం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. మహిళల సేవలను గుర్తించి వారికి సత్కారం అందించిన ముదిరాజ్ యువజన సంక్షేమ సంఘం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువజన సంక్షేమ సంఘం సభ్యులు పిట్టల అజయ్, రేగుల రాకేష్, రేగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది సునీత, తులసి, శ్రీలత, సంధ్య, వరలక్ష్మి, రాజా, శిరీష, నాగమ్మ తదితరులు హాజరయ్యారు.


Comments