మరకద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి 

డిసిపి దార కవిత 

మరకద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి 
సమావేశంలో మాట్లాడుతున్న డిసిపి కవిత

కాజీపేట్ మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు)

నేడు యువత మత్తు పదార్థాల బారినపడి తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని వాటిని నివారించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత అన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి నివేదన 99 రోజుల సదస్సులో భాగంగా మంగళవారం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ నివారణ కోసం మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ విభాగాలైన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విద్య, ఆరోగ్య, మహిళా విభాగం లతోపాటు ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మడికొండలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ కవిత హాజరై మాట్లాడుతూ ప్రజలు మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండాలని మన కోరారు డ్రగ్స్ నివారణ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ఆమె తెలిపారు. అందులో భాగంగా టీజీనాబ్,  ఈగల్  టీం,   వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరఫున డ్రగ్స్ కంట్రోల్ టైం ఏర్పాటు చేసి గంజాయి ఇతర మత్తు పదార్థాలను మూలించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు ఇతర ప్రభుత్వ విభాగాల నుండి వచ్చిన అధికారులు కూడా డ్రగ్స్ నివారణ కోసం చాలా విలువైన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో  అధిక సంఖ్యలో మడికొండ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కాజీపేటలో....

కాజీపేట లోని సోమిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరకద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించారు  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రోగ్రాం లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నియంత్రణపై జరిగిన  అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. సందర్భంగా జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తు దృశ్య మాదకద్రవ్యాల నిర్మూలనకు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులు లతో కలిసి పని చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఖాళీ సమయాలలో విద్యార్థులు క్రీడలకు కేటాయిస్తూ కోకో, వాలీబాల్, బ్యాట్మెంటన్ వంటి క్రీడలు ఆడితే శరీరకంగా తోపాటు మానసిక ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని ఈ సమయంలో సరైన మార్గంలో నడిస్తే వారి భవిష్యత్తు బంగారు మాయమవుతుందని ఆయన పేర్కొన్నారు. చెడు అలవాట్ల గురి కాకుండా మంచి లక్షలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ బారినపడి యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అలాంటి  సామాజిక రుగ్మతని అందరం కలిసి సమాజాన్ని విలువేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరకద్రవ్యాల  వ్యసనం వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా వారి కుటుంబంతో పాటు సమాజాన్ని దెబ్బతీస్తుందని ఆయన తెలిపారు. మారకద్రవ్యాల నియంత్రణకై తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వాటి వాడకం రవాణాలపై ఎలాంటి సమాచారం ఉన్న తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు వెంకటరమణ, నవీన్ కుమార్ పోలీస్ సిబ్బందితోపాటు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!