అడిషనల్ డీసీపీ (అడ్మిన్)ను కలిసిన ఎంపీజే బృందం
Views: 23
On
ఖమ్మం బ్యూరో, మార్చి 09(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం నగర పోలీస్ కమిషనరేట్‌లో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) బి. రామానుజం ను ఎంపీజే (ఎంపీజే) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జేఐహెచ్ ప్రధాన కార్యాలయంలో, మార్చి 11న నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఎంపీజే బృందం ఆహ్వానించింది. దీనిపై డీసీపీ (అడ్మిన్ ) బి. రామానుజం సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఎంపీజే జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిం సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల గురించి డీసీపీకి వివరించారు. అనంతరం ఎంపీజే బృందం తరఫున ఎంపీజే పరిచయ పుస్తకాన్ని డీసీపీ రామానుజంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిం, జిల్లా కోశాధికారి ఎండి హకీమ్, సభ్యుడు అర్షీన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments