మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 

మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 

హైదరాబాద్,మార్చి10(తెలంగాణ ముచ్చట్లు):

హిమాయత్‌నగర్‌లోని మేల్కోటే పార్క్‌లో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ  ప్రకటన కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మార్చి 14న మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో దళిత, బహుజన, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మహనీయుల ఆశయాలను విస్తృతంగా చాటిచెప్పేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర సమన్వయకర్త గాదె వెంకట్, డాక్టర్ బొమ్మెర స్టాలిన్, మాదిగ రాజకీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఒక్కలగడ్డ చంద్రశేఖర్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్, తాళ్ల సునీల్, తాళ్ల అజయ్, మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క మహేష్, విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు జోగు గణేష్, చాగంటి శేఖర్, చనుంపల్లి కిరణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!