ఉప్పల్ భగాయత్ అభివృద్ధికి రూ.13 కోట్ల నిధులు మంజూరు

ఉప్పల్ భగాయత్ అభివృద్ధికి రూ.13 కోట్ల నిధులు మంజూరు

_కమ్యూనిటీ హాల్, 10 కిలోమీటర్ల బ్లాక్‌టాప్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

_ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి ఫలితం

ఉప్పల్, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ భగాయత్ ప్రాంత అభివృద్ధికి రూ.13 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి, సహకారంతో ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పలుమార్లు సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించిన హెచ్ఎండిఏ అధికారులు ఈ నిధులను వివిధ అభివృద్ధి పనుల కోసం ఆమోదించినట్లు తెలిపారు.ఈ నిధులలో భాగంగా రూ.3 కోట్ల 40 లక్షల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అలాగే రూ.9 కోట్ల 60 లక్షలతో సుమారు 10 కిలోమీటర్ల మేర బ్లాక్‌టాప్ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి కాలనీలో రహదారి సౌకర్యాలను మెరుగుపరచనున్నారు.హెచ్ఎండిఏ లేఔట్ పరిధిలోని రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు 42 మంది పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. దీంతో కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయి.అదేవిధంగా లేఔట్‌లో రైతు బజార్ కోసం కేటాయించిన స్థలంలో కూరగాయల వ్యాపారం సక్రమంగా జరిగేలా అభివృద్ధి పనులు చేపట్టాలని, అలాగే సుమారు 8 ఎకరాల పార్కు స్థలానికి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, స్ట్రీట్ లైట్లు, పెద్దలు మరియు పిల్లలకు ఆటవిడుపు కోసం అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు.ఇక వెస్ట్ సైడ్‌లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సరఫరా వంటి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన సంబంధిత అధికారులతో చర్చించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!