పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి 

జిల్లా కలెక్టర్ అంకిత్

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి 

ఖమ్మం బ్యూరో, మార్చి 10(తెలంగాణ ముచ్చట్లు)

మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతికి ఎంతో కీలకమైన పరీక్షలు కావడంతో నిర్వహణలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 73 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 12,731 మంది రెగ్యులర్ విద్యార్థులు, 404 మంది ప్రైవేట్ అభ్యర్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రశ్నాపత్రాల రవాణా, భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బి సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాలపై నియంత్రణ వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాల విషయంలో అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్యశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సుజాత, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, డి పి ఓ సుధీర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.IMG-20260310-WA0088

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!