మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి 

వేలేరు సర్పంచ్  బిల్లా యాదగిరి 

మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి 

వేలేరు,మార్చి11(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అవగాహన సమావేశం నిర్వహించారు. వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో చర్చించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో గ్రామానికి మంజూరైన ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సమావేశంలో సూచించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి  మాట్లాడుతూ మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈ నెలాఖరు వరకు తమ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ఇల్లు నిర్మించుకునే స్థోమత లేని పేద కుటుంబాలకు ఏజెన్సీ ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో తదుపరి రెండో విడతలో కూడా వేలేరు గ్రామానికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం కృషి జరుగుతోందని వెల్లడించారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం కోసం మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించేందుకు సంబంధిత గ్రామ సంస్థల ద్వారా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శ్రీకర్, గృహనిర్మాణ శాఖ సహాయ ఇంజినీరు, గ్రామపంచాయతీ కార్యదర్శి రవికుమార్, మండల సమైక్య అధ్యక్షురాలు రేణుక, వార్డు సభ్యులు సంధ్య, మౌనిక, ప్రవళిక, చైతన్య, సంధ్య, సురేష్, సునీల్, క్లస్టర్ సమన్వయకర్త రమాదేవి, గ్రామ సంస్థల ప్రతినిధులుIMG-20260311-WA0098 రాణి, రాజమ్మ, ప్రేమలతతో పాటు గ్రామ పెద్దలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .