అయిదు గంటల్లో అయిదు సాధారణ కాన్పులు.!

అయిదు గంటల్లో అయిదు సాధారణ కాన్పులు.!

- అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన .
- తల్లీబిడ్డలు క్షేమం.

అశ్వారావుపేట, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అరుదైన ఘనత సాధించారు. కేవలం అయిదు గంటల వ్యవధిలో అయిదు సాధారణ కాన్పులు నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నారు. వీరిలో ముగ్గురు మగబిడ్డలు, ఇద్దరు ఆడబిడ్డలు జన్మించారు. తల్లులు, శిశువులు అందరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల మధ్య ఈ అయిదు సుఖప్రసవాలు జరిగాయి. వైద్య సిబ్బంది సమన్వయంతో అన్ని ప్రసవాలు సాఫీగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి మాట్లాడుతూ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గతంలో సురక్షిత ప్రసవాల కోసం గర్భిణీలు సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, డీసీహెచ్ఎస్ రవి బాబు సహకారంతో అశ్వారావుపేట ఆసుపత్రిలో అనేక సౌకర్యాలు కల్పించామని వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 24 గంటల ప్రసూతి వైద్యుల పర్యవేక్షణ, ఆపరేషన్ థియేటర్, మెటర్నిటీ వార్డుల్లో ఏసీ సౌకర్యం, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా టిఫా స్కాన్‌తో పాటు అన్ని రకాల రక్త పరీక్షలు కూడా ఆసుపత్రిలోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. దీంతో గర్భిణీ మహిళలు స్థానిక ఆసుపత్రిలోనే ప్రసవాలకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసూతి వైద్యురాలు డాక్టర్ మౌనిక, హెడ్ నర్సింగ్ ఆఫీసర్ ఆశావర్ధిని, నర్సింగ్ ఆఫీసర్ వీర కుమారి, ఏఎన్ఎమ్ సుజాత, పీసీ అనూష తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భూగర్భ జలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ భూగర్భ జలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
మేడ్చల్ మల్కాజ్గిరి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు): భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత...
ఏడాది పూర్తి చేసుకున్న పెద్దమందడి ప్రెస్ క్లబ్
మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి 
మల్కాజిగిరిలో నేడు మహిళా జన్ సున్వాయ్
ఉత్తమ ఎంఈఓగా రాజేశ్వరరావుకు అవార్డు.!
వేం నరేందర్ రెడ్డికి ఉప్పల్ కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి ఎమ్మెల్యే బండారి