మహిళల సాధికారతకు శ్రీ శక్తి అవార్డులు ప్రేరణ

మహిళల సాధికారతకు శ్రీ శక్తి అవార్డులు ప్రేరణ

మల్లాపూర్, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):

మల్లాపూర్ డివిజన్‌లోని మున్సిపల్ వార్డ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ శక్తి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నెమలి అనిల్ కుమార్ హాజరై మహిళలను అభినందించారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు నేటి సమాజంలో ప్రతి రంగంలో ముందంజలో నిలుస్తూ కుటుంబం, సమాజం మరియు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం, సమాజం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ప్రోత్సాహం కలిగించే ఉద్దేశంతో శ్రీ శక్తి అవార్డులను ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. మహిళలు విద్య, ఉపాధి, సామాజిక సేవ వంటి రంగాల్లో మరింతగా ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .