మల్కాజిగిరిలో నేడు మహిళా జన్ సున్వాయ్
మల్కాజిగిరి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సమస్యలను నేరుగా విని పరిష్కారం చూపేందుకు జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా సున్వాయ్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.రేపు (మార్చి 12) మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో మహిళా జన్ సున్వాయ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయా రహత్కర్ అధ్యక్షత వహించనున్నారు.మహిళల సమస్యలను నేరుగా విని వారికి తక్షణ పరిష్కారం చూపే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు చెందిన మహిళలు తమ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ఈ సమావేశంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. అలాగే వాక్–ఇన్ ఫిర్యాదులను కూడా స్వీకరించి సంబంధిత అధికారులతో పరిశీలించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఒక ప్రకటనలో కోరారు.


Comments