ఉపాధ్యాయుడు మట్టా అజయ్ కుమార్‌కు ఘన సన్మానం.!

ఉపాధ్యాయుడు మట్టా అజయ్ కుమార్‌కు ఘన సన్మానం.!

- సత్తుపల్లిలో పదవీ విరమణ సందర్భంగా అభినందనలు.
- కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి, టీజీఐడీసీ చైర్మన్ మువ్వా పాల్గొన్నారు.

సత్తుపల్లి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం సదాశివుని పాలెం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన మట్టా అజయ్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఘనంగా సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ హాజరై అజయ్ కుమార్‌ను శాలువా కప్పి సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాగే టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు కార్యక్రమంలో పాల్గొని అజయ్ కుమార్‌ను అభినందించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, పదవీ విరమణ అనంతర జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంIMG-20260311-WA0087లో ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, ప్రధాన ఉపాధ్యాయులు, గాదె చెన్నారావు, నాయుడు వెంకటేశ్వరరావు, మట్టా ప్రసాద్, దొడ్డా రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .