గ్యాస్ కొరతపై ఆందోళన అవసరం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి

గ్యాస్ కొరతపై ఆందోళన అవసరం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి

_బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు 

– జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

మేడ్చల్–మల్కాజ్గిరి, మార్చి 13 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. గ్యాస్ కొరతపై వస్తున్న వదంతుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర  సచివాలయం లో మంత్రి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గృహ వినియోగదారులకు అవసరమైనంత ఎల్‌పీజీ సరఫరా చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా గ్యాస్ కొరత నమోదు కాలేదని స్పష్టం చేశారు. వదంతులను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవద్దని వినియోగదారులకు సూచించారు.అపోహలను ఆసరాగా చేసుకుని గ్యాస్ నిల్వ చేయడం, అక్రమంగా మళ్లించడం లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి హెచ్చరించారు. ఇప్పటివరకు ఇటువంటి అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా 288 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు నిబంధనలు పాటించకపోతే మరింత కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లో ప్రతి 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు.
ఇదే సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీలు, నిల్వ స్థలాలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో వరి సాగు పెరిగిన నేపథ్యంలో సాగు నీటిని సమర్థవంతంగా అందించడంతో పాటు వైవిధ్య పంటలను ప్రోత్సహించాలని సూచించారు.అనంతరం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 52 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు.
ఎల్‌పీజీ సరఫరాలో ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ నంబర్: 040-29700820 ను సంప్రదించాలని అధికారులు సూచించారు. అసత్య ప్రచారాలను నమ్మకుండా ప్రజలు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డీఎం సివిల్ సప్లయ్ సుగుణ బాయి, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ, జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.IMG-20260313-WA0090

Tags:

Post Your Comments

Comments

Latest News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
కొనుగోలు కేంద్రాలు లేక దళారీల పాలవుతున్న మొక్కజొన్న రైతులు కేసీఆర్ పాలనలో కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచాం ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ...
ప్రగతి పథంలో పేదల సంక్షేమం
ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి
అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!
వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.
శీనన్న మృతి… మండలానికి తీరని లోటు
ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025–26 కింద స్వయం ఉపాధి పథకాలు