గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం 

టీజీఎస్‌ఆర్టీసీ ఖమ్మం రీజియన్

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం 

ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఖమ్మం రీజియన్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బి.కాం, బి.ఎస్‌సి, బి.బి.ఎ, బి.సి.ఎ, బి.ఏ మరియు ఇంజనీరింగ్/ డిప్లమా వంటి డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్‌షిప్‌కు అర్హులని పేర్కొన్నారు. ముఖ్యంగా 2021 సంవత్సరం తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ నాట్స్ 2.0 పోర్టల్ (https://nats.education.gov.in/) ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 14, 2026 నుండి మార్చి 23, 2026 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

ఎంపికైన అభ్యర్థులకు టీజీఎస్‌ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలోని డిపోలు మరియు వర్క్‌షాపుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

అప్రెంటిస్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని టీజీఎస్‌ఆర్టీసీ ఖమ్మం రీజియన్ మేనేజర్ సరి రామ్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .