ఖమ్మం జిల్లాలో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా దూసుకెళ్తున్న బీసీ సమాజం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె.వి కృష్ణారావు

ఖమ్మం జిల్లాలో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా దూసుకెళ్తున్న బీసీ సమాజం

ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం నగరంలో శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బత్తిని మధు గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె.వి కృష్ణారావు హాజరై మాట్లాడారు . సమాజంలో బీసీలు అనగా దొక్కబడుతున్నారని ఇప్పటికైనా మేల్కొని బీసీలు అంతా ఐక్యమై రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లేషన్ సభలో ఇచ్చిన హామీ అయిన బీసీ 42% రిజర్వేషన్ ను వెంటనే అమలు చేసి షెడ్యూల్ నైన్ (9) లో పొందుపరిచి చట్టబద్రత కల్పించాలని అలాగే బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ ను ఏర్పాటు చేసి సామాజిక , ఆర్థిక , రాజకీయ , విద్య , వైద్య మరియు ఉద్యోగ రంగాలలో బీసీ అభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పడి బీసీ బిడ్డలకు ముందు తరాల భవిష్యత్తును అందించాలని కోరారు . అలాగే మార్చ్ 15న జరిగే ఫీజు పోరు దీక్ష ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు . సత్తుపల్లి నియోజకవర్గం అధ్యక్షులు మారుతి ఆధ్వర్యంలో 5 మండలాల అధ్యక్షులు నియమించడం జరిగింది . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మోత్కూరు వెంకటేశ్వర చారి , రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు యాదవ్ , జిల్లా గౌరవ సలహాదారులు పద్మాచారి , జిల్లా ఉపాధ్యక్షులు మక్కల వెంకన్న , యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రాసాల సతీష్ యాదవ్ , ప్రధాన కార్యదర్శి చిన్నం శెట్టి వెంకట రామకృష్ణ , కోశాధికారి గునిగంటి వీరన్న , జిల్లా కార్యదర్శి కుందారపు సుధాకర్ , ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పుల్లూరు వెంకన్న బాబు , సత్తుపల్లి కాంసెన్సీ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు . కొండలరావు సత్తుపల్లి మండలం , మణికంఠ   వేంసూరు మండలం , శీను పెనుబల్లి మండలం , మురళి కల్లూరు మండలం , శ్రీనివాసరావు తల్లాడ మండలం వారిగా ఎన్నుకున్నారు .IMG-20260313-WA0067

Tags:

Post Your Comments

Comments

Latest News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
కొనుగోలు కేంద్రాలు లేక దళారీల పాలవుతున్న మొక్కజొన్న రైతులు కేసీఆర్ పాలనలో కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచాం ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ...
ప్రగతి పథంలో పేదల సంక్షేమం
ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి
అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!
వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.
శీనన్న మృతి… మండలానికి తీరని లోటు
ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025–26 కింద స్వయం ఉపాధి పథకాలు