పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
ఆదర్శంగా నిలిచిన మిత్రులు షేక్ రంజాన్, పగిలిపల్లి గణేష్
ఖమ్మం బ్యూరో, మార్చి 12(తెలంగాణ ముచ్చట్లు)
వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఇద్దరు యువ మిత్రులు తమ ఉదారతను చాటుకున్నారు. మండల పరిధిలోని నేరడ మరియు చింతకాని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు షేక్ రంజాన్ మరియు పగిలిపల్లి గణేష్ అనే మిత్రులు సొంత ఖర్చులతో పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాసి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఈ చిన్న సహాయం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువులో రాణించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పరీక్షల సమయంలో తమకు అవసరమైన సామాగ్రిని అందించినందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు ఆ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments