మనిగిల్ల ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం 

మనిగిల్ల ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం 

పెద్దమందడి,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని మనిగిల్ల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల నిర్వహణలో వివిధ బాధ్యతలను చేపట్టి తమ ప్రతిభను ప్రదర్శించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బి. శివ ప్రసాద్, జిల్లా కలెక్టర్‌గా డి. వైష్ణవి, జిల్లా విద్యాధికారిగా జి. కిరణ్ కుమార్, మండల విద్యాధికారిణిగా కె. నిత్య బాధ్యతలు నిర్వహించారు.కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల విద్యాధికారిణి మంజులత, గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నస్రీన్ బేగం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల అనుభవాలను పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .