శీనన్న మృతి… మండలానికి తీరని లోటు

అమ్మపల్లెలో విషాదం – గ్రామ ప్రజల కన్నీటి వీడ్కోలు

శీనన్న మృతి… మండలానికి తీరని లోటు

పెద్దమందడి,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల  అమ్మపల్లె గ్రామానికి చెందిన విట్టా లక్ష్మారెడ్డి–విమలమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి (శీనన్న) మృతి మండల వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. గత వారం రోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.అమ్మపల్లె గ్రామంలో జన్మించిన శ్రీనివాసరెడ్డి ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా పేరు సంపాదించారు.ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ముందుండి సహాయం చేసే స్వభావం ఆయనది. గ్రామ ప్రజల సమస్యలను అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన ఎప్పుడూ చురుకుగా వ్యవహరించేవారు.తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్ డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తదితర నాయకులతో ఆయనకు సన్నిహిత అనుబంధం ఉండేది. గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు విశేషమైనవి.అమ్మపల్లె గ్రామంలో తొలి సర్పంచ్‌గా, మద్దిగట్ల గ్రామంలో సర్పంచ్‌గా, పెద్దమందడి మండల సహకార సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో కీలక కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీలో రెండు పర్యాయాలు మండల అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతగా కొనసాగుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.చిన్నా పెద్ద తేడా లేకుండా అందరితో ఆప్యాయంగా మాట్లాడే స్వభావం కలిగిన శీనన్న మృతి పట్ల మద్దిగట్ల, మోజర్ల, గట్ల ఖానాపూర్ గ్రామాల ప్రజలు కూడా తీవ్ర దుఃఖం వ్యక్తం చేశారు.ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరని గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .