అమ్మపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇకలేరు… బీఆర్ఎస్‌కు తీరని లోటు

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

అమ్మపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇకలేరు… బీఆర్ఎస్‌కు తీరని లోటు

పెద్దమందడి,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా  పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు అమ్మపల్లి శ్రీనివాస్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం పట్ల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి హఠాన్మరణం చెందడం బాధాకరమని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా శ్రీనివాస్ రెడ్డి గుర్తింపు పొందారని, గ్రామాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో తనకు అండగా నిలిచి సహకరించిన వ్యక్తిగా ఆయనను గుర్తు చేసుకున్నారు.నాయకుడిగా మాత్రమే కాకుండా తమ్ముడిలా కీలక సమయాల్లో తోడుగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడం వ్యక్తిగతంగా తీరని లోటని నిరంజన్ రెడ్డి భావోద్వేగంగా తెలిపారు.రైతు పక్షపాతిగా పేరు గాంచిన శ్రీనివాస్ రెడ్డి మరణం అమ్మపల్లి గ్రామానికి మాత్రమే కాకుండా పెద్దమందడి మండలానికి కూడా తీరని నష్టమని అన్నారు.దివంగత శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని ఎదుర్కొనే ధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మాజీ మంత్రి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .