ఎస్ ఎస్ సి పరీక్షల నేపథ్యంలో మల్కాజిగిరి కమిషనరేట్‌లో 144 సెక్షన్ అమలు

ఎస్ ఎస్ సి పరీక్షల నేపథ్యంలో మల్కాజిగిరి కమిషనరేట్‌లో 144 సెక్షన్ అమలు

_పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడడంపై నిషేధం 

– జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ల మూసివేతకు ఆదేశాలు

మల్కాజిగిరి, మార్చి 13 (తెలంగాణ ముచ్చట్లు):

పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కమిషనర్ అవినాష్ మహంతి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు.ఈ ఆదేశాల ప్రకారం పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల పరిధిలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ ఆంక్షలు మార్చి 14 ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 16 సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. అయితే విధుల్లో ఉన్న పోలీసులు, మిలిటరీ సిబ్బంది, హోమ్ గార్డులు, విద్యాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు మరియు అంత్యక్రియల ఊరేగింపులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వబడింది.
పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని 100 మీటర్ల పరిధిలో ఉన్న ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు.నిబంధనలను ఉల్లంఘించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడడం లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరవడం వంటి చర్యలు చేపట్టినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .