శ్రీశైలం మల్లికార్జున నాటక ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం
పెద్దమందడి,మార్చి14(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో త్వరలో నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ శ్రీశైలం మల్లికార్జున నాటకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరుకావాలని నాటక కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఏడాది భక్తి భావంతో శ్రీశైలం మల్లికార్జున నాటకాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా భక్తుల సమక్షంలో ఘనంగా నాటక ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరై ప్రారంభోత్సవం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పామిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు మంజుల శ్రీశైలం, మాజీ సర్పంచ్ తిక్కన్న, వార్డు సభ్యులు యాదయ్య గౌడ్, డోలు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


Comments