జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ
కీసర, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిమ్మకాయల పెద్దిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన నాయకులు రవి రాజ్ రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఎప్పటికీ బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడే పార్టీ అని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందని, ప్రజల మద్దతుతో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వై రమేష్, జనసైనికులు, వీర మహిళలు మరియు పలువురు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ స్థాపక నాయకుడి ఆశయాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.కార్యక్రమాన్ని కార్యకర్తలు ఉత్సాహభరితంగా నిర్వహించారు.


Comments