నాగారంలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫాల పంపిణీ
నాగారం, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగారం డివిజన్‌లో ఉన్న మసీదులో ముస్లిం సోదర సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు అవసరమైన రంజాన్ కానుకలను అందజేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీవుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తోఫాలను పంపిణీ చేశారు. నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, పరస్పర సహకారం మరియు సేవా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు శాంతి, సౌభ్రాతృత్వంతో రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు పంగ హరిబాబు, మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అశోక్ గౌడ్, కొండల్ రెడ్డి, సతీష్ గౌడ్, జీవన్ రెడ్డి, పర్వత్ రెడ్డి, మంచాల ప్రవీణ్ కుమార్,
శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments