చింతలపల్లెలో ఘనంగా తొలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

చింతలపల్లెలో ఘనంగా తొలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఎల్కతుర్తి, మార్చ్ 14 (తెలంగాణ ముచ్చట్లు) 

ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లె గ్రామంలో తొలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీ హాజరై గృహప్రవేశాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు బుసరి రామారావు – రమ దంపతులు తమ సొంత ఇంటిలోకి అడుగుపెట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సుకినే సంతాజీ మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది పేద కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని, ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు లభించడం తమ కుటుంబానికి ఎంతో సంతోషకరమైన విషయమని లబ్ధిదారులు బుసరి రామారావు, రమ తెలిపారు. తమ సొంత ఇంటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హింగే సంతాజీ, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, లోలేట చిరంజీవి, అంబీరు గోపాల్, కుడితాడి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామంలో తొలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం జరగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.

Tags:

Post Your Comments

Comments

Latest News