బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తాడూరి శ్రీనివాస్ నియామకం 

డా. ఏఎస్ రావు నగర్ డివిజన్‌కు గర్వకారణమని నాయకుల అభినందనలు

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తాడూరి శ్రీనివాస్ నియామకం 

కాప్రా, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా (స్పోక్స్ పర్సన్) నియమితులైన తాడూరి శ్రీనివాస్‌కు స్థానిక నాయకులు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్‌కు చెందిన కమలానగర్ నివాసి తాడూరి శ్రీనివాస్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర తొలి ఎంబీసీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులవడం డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ ప్రజలకు గర్వకారణమని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మర్రి మోహన్ రెడ్డి, కె. రమేష్ యాదవ్, దొంతుల ప్రభాకర్, ఏనుగు సీతారాం రెడ్డి, వెంకన్న నాయక్, సుధాకర్, టి. మాధవరావు, డాక్టర్ వెంకటరమణాచారి, ప్రేమ్ గౌడ్, హరినాథ్ గౌడ్, ఏనుగు మంజుల, పుష్పలత, శ్రీకాంత్, శ్రీహరి, బద్దం సుధాకర్ రెడ్డి, జె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .