కాప్రాలో  ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

కాప్రాలో  ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

కాప్రా, మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్  డివిజన్ సాయిబాబా నగర్‌లోని జామియా మస్జీద్-ఈ-నూరి మసీదులో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా “ఈద్ కా తోఫా” కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజు శివమణి డివిజన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా స్వర్ణరాజు శివమణి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం “ఈద్ కా తోఫా” కిట్లను పంపిణీ చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న ఈ రంజాన్ తోఫా కిట్లు మంచి నాణ్యతతో ఉన్నాయని, పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. అలాగే ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ మైనారిటీ నాయకులు మరియు ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు సయ్యద్ ముర్తుజా, షేక్ చోటు భాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కిట్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సయ్యద్ ముర్తుజా మాట్లాడుతూ సాయిబాబా నగర్ ప్రాంతంలోని పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ రంజాన్ తోఫా అందేలా కృషి చేసిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, కాప్రా డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజు శివమణి, మేడ్చల్ మల్కాజిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విఠల్ నాయక్, పడమటి మల్లారెడ్డి, జి. సత్యనారాయణ, తన్నీరు శ్రీహరి, మచ్చ శ్రీకాంత్ గౌడ్, షాబుద్దీన్, మహమ్మద్ ఆరిఫ్IMG-20260315-WA0119, సిద్ధిక్, కే. రాజు, ప్రదీప్, వినయ్, కాప్రా డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్, మసీదు సదర్ జలీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News