విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపిన శిశుమందిర్ పాఠశాల విద్యా విహారయాత్ర
పెద్దమందడి,మార్చి15(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు ఆదివారం ఒకరోజు విద్యా విహారయాత్రను నిర్వహించారు. పాఠశాల మాతాజీలు అరుణ, శశికళ, స్వర్ణరంజిత, సువర్ణ ఆధ్వర్యంలో ఈ విహారయాత్ర జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మన్నెంకొండ దేవస్థానానికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం విద్యార్థులను పాలమూరు (మహబూబ్‌నగర్)లోని పిల్లలమర్రి విజ్ఞాన కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విజ్ఞాన ప్రదర్శనలను చూపించారు.అలాగే మయూరి పార్క్‌లోని పచ్చని పందిళ్లలో విద్యార్థులు ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు విజ్ఞాన కేంద్రంలోని నమూనాలు, శాస్త్రీయ ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షిస్తూ కొత్త విషయాలను తెలుసుకున్నారు. చదువుతో పాటు విద్యార్థులకు ఆధ్యాత్మిక విలువలు, చరిత్ర, విజ్ఞానం వంటి అంశాలపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ విహారయాత్రను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.విద్యార్థులు ఈ విద్యా విహారయాత్రను ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ మంచి అనుభవాన్ని పొందారని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర వికాసానికి ఎంతో ఉపయోగపడతాయని సరస్వతీ విద్యాపీఠం వనపర్తి జిల్లా అధ్యక్షుడు మన్సోజు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ధనుంజయ గౌడ్, కోశాధికారి గట్టుమీది భానుప్రసాద్, వనపర్తి కేడీఆర్ శిశుమందిర్ కార్యదర్శి అరవింద్ ప్రకాష్, ప్రధానాచార్యులు కిషోర్, సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఎల్ల భాస్కర్ తెలిపారు.


Comments