శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి

వనపర్తి,మార్చి15(తెలంగాణ ముచ్చట్లు):

కొత్త తెలుగు సంవత్సరం “శ్రీ పరాభవ” నామ సంవత్సరానికి రూపొందించిన పంచాంగాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాంగాన్ని విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.తెలుగు ప్రజల ముఖ్య పండుగ అయిన ఉగాది షడ్రుచుల సమ్మేళనమని, జీవితం లో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, కందూరు నారాయణ రెడ్డి, బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, దేశి రాములు యాదవ్, సి. కిరణ్ కుమార్, గంధం నాగరాజు, విజయ్, డా. కంటే నిరంజనయ్య, డా. ఎన్. నరసింహ శర్మ, బుజ్జిబాబు, ప్రవీణ్ కుమార్, నందిమల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .