ఫాదర్ కొలంబో 100వ జయంతి వేడుకలు ఘనంగా 

గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభం

ఫాదర్ కొలంబో 100వ జయంతి వేడుకలు ఘనంగా 

ధర్మసాగర్,మార్చి15(తెలంగాణ ముచ్చట్లు): 

ప్రముఖ సేవామూర్తి ఫాదర్ కొలంబో గారి 100వ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫాదర్ కొలంబో గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ మెత్రాసనా పాలనాధికారి ఫాదర్ విజయ్ పాల్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఫాదర్ విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ ఫాదర్ కొలంబో గారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ముఖ్యంగా పేద ప్రజలకు విద్యా, వైద్య సేవలు అందించడంలో విశేష కృషి చేశారని అన్నారు. ఆయన సేవా భావం సమాజానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆరోగ్య కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ఫాదర్ కొలంబో గారు మానవతా దృక్పథంతో సమాజ సేవలో ముందుండి పనిచేశారని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకుంటూ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య కేంద్రం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫాదర్ కొలంబో మెడికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఫాదర్ తరుణ్ రెడ్డి, మెడికేర్ హాస్పిటల్ డైరెక్టర్ ఫాదర్ చిన్నపరెడ్డి, విచారణ గురువులు ఫాదర్ సుధాకర్, వంగలపల్లి సర్పంచ్ భూక్యా మేనక, కరుణాపురం సర్పంచ్ గుర్రపు రీనా ప్రవీణ్, పెద్దపెండ్యాల సర్పంచ్ తోటనాగరాజు, ధర్మాపురం సర్పంచ్ బొమ్మినేని రమాదేవి,నష్కల్ సర్పంచ్ రాజు యాదవ్,ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు మరియు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260315-WA0105

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .