జాతీయ పోటీలకు అర్హత సాధించిన యువ అథ్లెట్లు

జాతీయ పోటీలకు అర్హత సాధించిన యువ అథ్లెట్లు

మేడ్చల్ మల్కాజిగిరి , మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 3వ రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ పోటీలలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు చెందిన అథ్లెట్లు విశేష ప్రతిభ కనబరిచారు. కోచ్ తిరుమల రావు శిక్షణలో ఉన్న విద్యార్థులు పలు విభాగాల్లో మెడల్స్ సాధించి జిల్లాకు గౌరవం తీసుకొచ్చారు.ఈ పోటీల్లో అండర్–20 విభాగంలో గరిగే అభినయ శ్రీ 100 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించగా, మహిళల 400 మీటర్ల పరుగులో పోత్రకుండ సరిత స్వర్ణ పతకం గెలుచుకున్నారు. అలాగే పురుషుల 100 మీటర్ల పరుగులో తిరుమల కాంస్య పతకం అందుకున్నారు.అండర్–14 బాలికల 600 మీటర్ల పరుగులో ఎస్. గౌతమి, ఎం. దీపిక ఫైనల్స్‌కు అర్హత సాధించి మంచి ప్రతిభ కనబరిచారు.ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అథ్లెట్లు ఈనెల 28న చండీగఢ్ లో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా విజేతలను కోచ్ తిరుమల రావు అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .