చర్లపల్లి ఐజి కాలనీలో మహిళల కోసం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

చర్లపల్లి ఐజి కాలనీలో మహిళల కోసం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

చర్లపల్లి, మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఐజి కాలనీలో మహిళల కోసం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. బొంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణలో ముందస్తు పరీక్షలు చాలా కీలకమని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులపై మహిళలకు అవగాహన కల్పిస్తూ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ వైద్య శిబిరంలో సుమారు 120 మంది మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె. సీతారాం రెడ్డి, ప్రభు గౌడ్, గోపాల్ యాదవ్, ప్రకాష్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్నిసద్వినియోగం చేసుకున్నారు.IMG-20260315-WA0029

Tags:

Post Your Comments

Comments

Latest News