అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

కీసర, మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు):

కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 214వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఆదివారం కీసరలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కీసరలోని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించి నివాళులు అర్పించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామాజిక సేవా కార్యకర్త సన్నాల బాబాచారి మాట్లాడుతూ, బహుజనులకు ఆత్మగౌరవం, రాజకీయ ప్రాముఖ్యతను కల్పించిన మహనీయుడు మాన్యశ్రీ కాన్షీరామ్ అని అన్నారు. కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్, ప్రధాన కార్యదర్శి మంచాల సంజీవ్ మరియు కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం మెడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు.1934లో జన్మించిన కాన్షీరామ్ భారతదేశంలో బహుజనులు (దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు) హక్కుల కోసం పోరాడిన ప్రముఖ సామాజిక సంస్కర్త మరియు రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకుడిగా, “బహుజన్ నాయక్”గా ప్రసిద్ధి చెందిన ఆయన సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం బహుజనులను ఏకం చేసి అంబేద్కర్ సిద్ధాంతాలను బలోపేతం చేసిన మహనీయుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు పులిపాక తిరుపతి, బొల్లి మహేష్, కోశాధికారి రొండ్ల మహేష్, సంయుక్త కార్యదర్శులు సుమన్ బన్నీ, గంగి ఆంజనేయులు, మంచాల మహేష్, తాళ్ళ కిరణ్, ముఖ్య సలహాదారులు దాయర బాల్ నర్సింహ, రాగుల రమేష్ ముదిరాజ్, కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్, మండల మాజీ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్, మాజీ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్, నాయకులు మొరుగు క్రాంతికుమార్, అక్కపల్లి అశోక్, గాలిగళ్ల శ్రీనివాస్, దాయర శ్రీనివాస్, నరేందర్ నాయి, బోడ నరేశ్, మొరుగు మహేష్, పుండ్రు రాకేష్, తుడుం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News