స్నేహానికి నిదర్శనం… మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పాఠశాల స్నేహితులు

స్నేహానికి నిదర్శనం… మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పాఠశాల స్నేహితులు

పెద్దమందడి,మార్చి15(తెలంగాణ ముచ్చట్లు):

తోటి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటారు పాఠశాల బాల్యమిత్రులు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన ఎం.డి. నిరంజన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న 1998–99 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన ఆయన బాల్యమిత్రులు కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.స్నేహితులు కలిసి రూ.21,000/-రూపాయల నగదును నిరంజన్ కుటుంబ సభ్యులకు అందజేసి తమ మద్దతును తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా తమ బాల్యమిత్రుడి పిల్లల చదువుల కోసం ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన ఈ చర్యను స్థానికులు అభినందించారు.ఇలాంటి సహకారం నిజమైన స్నేహానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News