లైఫ్ లైన్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అభినందనీయం 

డాక్టర్ కూరపాటి ప్రదీప్ 

లైఫ్ లైన్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అభినందనీయం 

ఖమ్మం బ్యూరో, మార్చి 15(తెలంగాణ ముచ్చట్లు) 

లైఫ్ లైన్ ఫౌండేషన్ నిరుపేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమనిప్రముఖ పిల్లల వైద్యులు, అభయ హాస్పిటల్ సీఈవో  డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ అన్నారు. ఆదివారం  ఎన్.ఎస్. టీ రోడ్డు లో  గల అంజుమ్ క్లినిక్ ఆవరణలో నిరుపేద ముస్లిం లకు లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేస్తున్న రంజాన్ కిట్ల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని , మాట్లాడారు. తొలుత తన చేతుల మీదుగా నిరుపేద ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ లైఫ్ లైన్ పౌండేషన్ ఏర్పాటు చేసి ,ఇటువంటి సేవా దృక్పథంతో ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో లైఫ్ లైన్ ఫౌండేషన్ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. సమాజంలో ఇటువంటి సంస్థల అవసరం ఎంతైనా ఉందని, ఫౌండేషన్ చేసే ప్రతి మంచి పనికి తన వంతు సహాయం ,సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా లైఫ్ లైన్
ఫౌండేషన్ సభ్యులు , మిత్రబృందం  
డాక్టర్ కూరపాటి ప్రదీప్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షేక్ . జానీ మియా వారి మిత్ర బృందం షేక్ .ఇమ్రాన్ , డాక్టర్. మొహమ్మద్ అల్తాఫ్ , షేక్. మన్సూర్ అలీ , యం డి. రహీం , మీరాజోదన్ , యం డి. ఆసిఫ్ , మహమ్మద్ ఖదీర్ , సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News