నాచారంలో సమస్యలపై డిప్యూటీ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు
_దోమల నివారణకు వారంలో రెండు సార్లు ఫాగింగ్ చేయాలని డిమాండ్
_ప్రజా పాలన హామీలు అమలు కాలేదని ఆక్షేపణ
నాచారం, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై బీజేపీ నాయకులు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రాంతంలో పెరుగుతున్న దోమల బెడదపై ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.ప్రత్యేకంగా నాచారం డివిజన్ పరిధిలో దోమల సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వారానికి కనీసం రెండు సార్లు ఫాగింగ్ నిర్వహించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం, హెచ్‌ఎంటీ నగర్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రామచందర్ రావు పిలుపు మేరకు ఉమ్మడి నాచారం డివిజన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం “ప్రజా పాలన” పేరుతో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఈ సందర్భంగా వారు విమర్శించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ పోతగాని, ఎస్పీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ రవి, డివిజన్ అధ్యక్షుడు నవీన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల నర్సింగ్ రావు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ అనిత పద్మారెడ్డి, ప్రకాశ్, పాదం వెంకటేష్, కాటిపల్లి రవీందర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, దయా గౌడ్, నవీన్ గౌడ్, నవీన్ రెడ్డి, డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజుల వాణి, వరలక్ష్మి, బాలు తదితరులు పాల్గొన్నారు.


Comments