హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ పునఃనిర్మాణానికి రూ.10 వేల విరాళం

హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ పునఃనిర్మాణానికి రూ.10 వేల విరాళం

కీసర, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం డివిజన్ పరిధిలోని వెంకులోనిగుట్టలో ఉన్న హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ పునఃనిర్మాణ పనులకు భక్తులు ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీసర మాజీ వార్డు సభ్యులు తుడుం శ్రీనివాస్ దేవాలయ పునఃనిర్మాణం కోసం రూ.10,000 విరాళాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు తుడుం శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.వెంకులోనిగుట్టలో ఉన్న ఈ పురాతన దేవాలయానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. దేవాలయ పునఃనిర్మాణానికి భక్తులు, దాతలు ముందుకు వచ్చి సహకరించాలని దేవస్థాన ప్రతినిధులు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .