బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 

రడపాక డానియెల్,కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ సీనియర్ నాయకులు 

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 

హైదరాబాద్,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్ బోడుప్పల్‌లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నివాసంపై జరిగిన దాడి ఘటనను స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక డానియల్ ఖండించారు. ఈ ఘటన అనవసర ఉద్రిక్తతలకు దారితీసే విధంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.మందుల సామేలు చేసిన వ్యాఖ్యలను కారణంగా చూపుతూ బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. చిన్న విషయాలను పెద్దగా చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి చర్యలు సమాజంలో విభేదాలను పెంచుతాయని అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విభేదాలు రేకెత్తించడం తగదని, శాంతి, సామరస్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని రడపాక డానియల్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మందుల సామేలు కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .