భగాయత్‌లో ఎంఎంసీ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం
_రూ.98 కోట్లతో 10 ఎకరాల్లో ఆధునిక భవనం
_స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ ఇంచార్జీలు
-సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
ఉప్పల్, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ప్రధాన కార్యాలయాన్ని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూసీ నది ఒడ్డున 10 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.98 కోట్ల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో ఈ భవనం నిర్మించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలు తెలిపారు.మంగళవారం ఎల్బీనగర్ ఇంచార్జి మధుయాష్కీ గౌడ్, మేడ్చల్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి కలిసి భగాయత్‌లో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, మాజీ బోడుప్పల్ మేయర్ అజయ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, ధన్పాల్ రెడ్డి, పవని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు సంబంధిత శాఖల అధికారులు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు నేతలు తెలిపారు. ఎంఎంసీ పరిధిలోని ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాలకు ఉప్పల్ కేంద్రంగా ఉండటంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.అందరికీ అందుబాటులో ఉండే
విధంగా ఉప్పల్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments