ముస్లిం సోదరులకు అండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం

మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బైరు హరినాథ్ బాబు 

ముస్లిం సోదరులకు అండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ఖమ్మం బ్యూరో, మార్చి 17(తెలంగాణ ముచ్చట్లు)

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరీ సోదరీమణులకు కానుకగా అందిస్తున్న 'రంజాన్ తోఫా' (బట్టల కిట్లు) పంపిణీ కార్యక్రమం ఎదులాపురం మున్సిపాలిటీలో ఘనంగా జరిగింది. మంగళవారం 8వ వార్డు పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్-1, మజీద్-ఏ-ఫాతిమా వద్ద ముస్లిం సోదరులకు కిట్లను పంపిణీ చేసి, అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నాయకులు పాల్గొన్నారు.
​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మద్దెలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, 8వ వార్డు కౌన్సిలర్ సంఘాని సుశీల, 13వ వార్డు కౌన్సిలర్ బైరు కోటేశ్వరరావు, మరియు 9వ వార్డు కౌన్సిలర్ కందుకూరి వెంకటనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు మాట్లాడుతూ.. పేద ముస్లింలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ తోఫా కిట్లను అందిస్తోందని తెలిపారు. లౌకికవాదానికి నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాల పండుగలను గౌరవిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న నాయుడు, పాలేరు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఇంచార్జ్ షేక్ నజీరుద్దీన్, సంఘాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మజీద్ అధ్యక్షులు షేక్ రషీద్, షేక్ హుస్సేన్, షేక్ ముబారక్, షేక్ ముక్రం, షేక్ బాబా మరియు కాలనీవాసులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
​ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి నాయకులు ప్రార్థనల్లో పాల్గొని, వారి మధ్య సోదరభావాన్ని చాటుకున్నారుIMG-20260317-WA0041

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .