జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం

మహబూబాబాద్,మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి జాటోత్ లచ్చా నాయక్ (95) కన్నుమూశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
లచ్చా నాయక్ పార్ధీవ దేహాన్ని పలువురు నాయకులు, బంధుమిత్రులు సందర్శించి పూలమాలలు అర్పిస్తూ నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ఎన్ నాయక్, భానోత్ వెంకన్న, బాదావత్ బాలాజీ, రామన్న, జాటోత్ కిషన్ నాయక్, రాష్ట్ర ట్రైబల్ జర్నలిస్టు యూనియన్ సంయుక్త కార్యదర్శి లావుడియా పల్లవి రాజు నాయక్, పోరిక రమేష్ నాయక్, ప్రొఫెసర్ మూడు రమేష్, సీనియర్ జర్నలిస్ట్ భూక్య శ్రావణ్ కుమార్ తదితరులు నివాళులు అర్పించారు.అనంతరం జాటోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అంత్యక్రియలలో కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.లచ్చా నాయక్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .