పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యసాధ్యం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివశంకర్

పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యసాధ్యం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివశంకర్

_ఎన్ఎస్ఎస్ ముగింపు కార్యక్రమంలో యువతకు ప్రేరణ

_ట్రాఫిక్ భద్రతపై అవగాహన కల్పన

కుషాయిగూడ, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):

పట్టుదలతో కృషి చేస్తే అనుకున్న గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చని జవహర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గౌడ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) కార్యక్రమం ముగింపు వేడుకలు కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ జై జవాన్ కాలనీ, ఈసీఐఎల్ ప్రాంతాల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్స్పెక్టర్ శివశంకర్ హాజరై మాట్లాడుతూ, జీవితంలో ఓటములు సహజమని, వాటితో నిరుత్సాహపడకుండా గెలుపు కోసం కృషి చేయాలని యువతకు సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణ రక్షణకు కీలకమని చెప్పారు. “బ్రతికి సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ముఖ్యమని” ఆయన సూచించారు.అలాగే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంచుతున్నామని తెలిపారు. యువత ఏ రంగంలోనైనా సాధించగల సామర్థ్యం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.విశిష్ట అతిథి లయన్ జ్యోతిర్మయాచారి మాట్లాడుతూ, విద్య అనేది కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా, మానవీయ విలువలను పెంపొందించేలా ఉండాలని అన్నారు.సమాజానికి ఉపయోగపడే విధంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కరుణాసాగర్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమాదేవి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అశోక్, ప్రొఫెసర్ డాక్టర్ నరేష్, ఎఎస్‌ఐ గోపాల్ గౌడ్, విశ్వకర్మ ట్రస్ట్ ప్రతినిధులు కలకొండ బిక్షపతి, మారోజు నరసింహచారి తదితరులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .