సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!

అధ్యక్షుడిగా కూకలకుంట రవి ఏకగ్రీవ ఎన్నిక.

సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!

సత్తుపల్లి, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పడింది. అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కూకలకుంట రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా సాధు కృష్ణయ్య, జాయింట్ సెక్రటరీగా వంకదారు రామకృష్ణ, కోశాధికారిగా కొప్పుల కేశవరెడ్డి, లైబ్రరీ సెక్రటరీగా నల్లగట్ల విజయకుమార్ ఎంపికయ్యారు. స్పోర్ట్స్ గేమ్స్ కార్యదర్శిగా జేవీ నరేంద్ర, మహిళా ప్రతినిధిగా ఎస్‌కే జీనత్ హస్సీనా ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులుగా గుంట్రు శ్రీనివాసరావు, మోదుగు నరేష్‌లను ఎన్నుకున్నారు.
తెలంగాణ బార్ అసోసియేషన్ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న ఎన్నికలు జరగాల్సి ఉండగా, సత్తుపల్లిలో ఈ నెల 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. 16న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీ లేకపోవడంతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఖరారైంది. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా ఎస్. లక్ష్మణరావు వ్యవహరించారు. కాగా, ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక ఈ నెల 26న నిర్వహించనున్నారు. నూతన కార్యవర్గం ఏప్రిల్ 1 నుంచి ఏడాది కాలం పాటు బాధ్యతలు నిర్వహించనుంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .