కళలు మానసిక ఆనందాన్నిస్తాయి

పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు 

కళలు మానసిక ఆనందాన్నిస్తాయి

వనపర్తి,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెబ్బేర్‌లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో జిల్లా రంగస్థల కళాకారులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పాల్గొని కళాకారులను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళలు మరియు సాహిత్యం మనిషికి మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని తెలిపారు. కళ కళ కోసం కాదు, ప్రజల కోసం అన్న నానుడిని అనుసరించి కళాకారులు ప్రజల ఉల్లాసం కోసం తమ ప్రతిభను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.గత యాభై సంవత్సరాలుగా సరస్వతీ కళా సమితి ద్వారా పెబ్బేర్ కళాకారులు పౌరాణిక, జానపద, చారిత్రక నాటకాలను ప్రదర్శిస్తూ రంగస్థల కళకు సేవలందించడం అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎల్. ఉమామహేశ్వర్, కార్యదర్శి సర్వారెడ్డి, సితార వెంకటేశ్వర్లు తదితరులను శాలువాలు, జ్ఞాపకాలతో సత్కరించారు.కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు బైరోజు చంద్రశేఖర్, రాములు, గోవర్ధన్ చారి, శ్రీనివాస్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .