చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా

ఇద్దరిపై కేసు నమోదు, ట్రాక్టర్లు స్వాధీనం

చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా

పెద్దమందడి,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): 

ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిపై పెద్దమందడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జలంధర్ రెడ్డి తెలిపారు.వివరాల్లోకి వెళితే… మార్చి 16, 2026 తెల్లవారుజామున పెద్దమందడి మండల పరిధిలోని చిలుకటోనిపల్లి వాగు నుండి రాత్రి సమయంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను రెండు ట్రాక్టర్లలో తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా చిలుకటోనిపల్లి గ్రామానికి చెందిన భాజ శీను మరియు కనిమెట్ట గ్రామానికి చెందిన బోయ సుధాకర్ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారి పై కేసు నమోదు చేసి, ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జలంధర్ రెడ్డి తెలిపారు.ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జలంధర్ రెడ్డి హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .