వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.

వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.

- 50%కు పైగా నష్టమంటూ రైతుల ఆవేదన వెల్లడి.
- ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా) రకంపై రైతుల అసంతృప్తి.

సత్తుపల్లి, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం సిధ్ధారం గ్రామానికి చెందిన రైతులు రాష్ట్ర యువ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్‌ను కలిసి తమ గోడును వినిపించారు. రబీ సీజన్‌లో శ్రీరామ్ సీడ్స్ కంపెనీకి చెందిన ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా) రకం వరి విత్తనాలతో సాగు చేసినట్లు తెలిపారు.
రైతుల వివరాల ప్రకారం, పంట మొదట బాగానే పెరిగినప్పటికీ, వరి ఈనిన తర్వాత 50 శాతం పైగా తాలు గింజలు కనిపించాయని తెలిపారు. మంచి దిగుబడి ఆశించి పెట్టుబడులు పెట్టిన తమకు ఈ పరిస్థితి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఇలా అన్ని విధాలా భారీగా ఖర్చు చేసినప్పటికీ, నాణ్యమైన ధాన్యం రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. నమ్మకంతో కొనుగోలు చేసిన విత్తనాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాలు గింజలు అధికంగా రావడానికి కారణాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ తుమ్మల యుగంధర్‌ను విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .