జంగమయ్యపల్లిలో మధుమేహ రోగులకు ఉచిత నేత్ర రెటినోపతి పరీక్షలు

జంగమయ్యపల్లిలో మధుమేహ రోగులకు ఉచిత నేత్ర రెటినోపతి పరీక్షలు

పెద్దమందడి,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం జంగమయ్యపల్లి గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ మరియు ఆరోగ్య వైద్యాధికారి ఆదేశాల మేరకు డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శిబిరం ఇంచార్జి డా. తార శశాంక మాట్లాడుతూ, డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ ద్వారా షుగర్ పేషెంట్లలో కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు.సమయానికి పరీక్షలు చేయించుకోకపోతే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ శిబిరంలో సుమారు 50 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జ్యోతి నాగరాజు మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డా. వీణా, డా. సాయి ప్రసాద్, గ్రామ సెక్రటరీ, హెల్త్ అసిస్టెంట్ ఈశ్వరమ్మ, సిబ్బంది రాము, సతీష్, ఆప్టామెట్రిస్ట్ యామిని తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం