పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం

పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం

పెద్దమందడి,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు):

 పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును గ్రామ కాంగ్రెస్ నాయకులు మధిర  శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రంజాన్ పండుగ ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు.సర్వ మానవాళి శ్రేయస్సు కోసం 30 రోజులపాటు ఉపవాస దీక్ష చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిక్కన్న సిద్దయ్య, మాజీ ఎంపిటిసి ఇంద్ర లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు రాములమ్మ, నరేష్, లక్ష్మి, రాజ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.IMG-20260317-WA0086

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .