మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

_ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు

మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఏ ఎస్ రావు నగర్, మార్చి 21 (తెలంగాణ ముచ్చట్లు): 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఎస్ రావు నగర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సాధికారత, సమానత్వం మరియు సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రను వివరించారు.మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ, మహిళల ఆత్మవిశ్వాసం, ఐక్యత, స్వయం ఉపాధి అవకాశాల పెంపు సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతించారు. మహిళల కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.మహిళా సాధికారతకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, వారి అభ్యున్నతికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాలనీ అధ్యక్షుడు నాగు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమార స్వామి, పర జ్యోతి (వ్యవస్థాపకురాలు), జి. ప్రియాంక (ప్రోగ్రామ్ డైరెక్టర్), కె. దుర్గా దేవి (ప్రోగ్రామ్ కోఆర్డినేటర్), కరే నీరజ, సి. లక్ష్మీశారదతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. IMG-20260321-WA0075

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .