వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను నేర్చుకున్న ఎల్కతుర్తి రైతులు

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను నేర్చుకున్న ఎల్కతుర్తి రైతులు

ఎల్కతుర్తి, మార్చి 20:( తెలంగాణ ముచ్చట్లు) 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన రైతులు వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలపై అవగాహన పెంపొందించుకునేందుకు పర్యటన చేపట్టారు. తిమ్మాపూర్–ఎల్కతుర్తి క్లస్టర్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మండలంలోని చింతలపల్లి, ఎల్కతుర్తి, దామెర, ఇంద్రనగర్, బావుపేట, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామ్ ఆయిల్ పరిశ్రమను సందర్శించారు. ఈ పర్యటనను ఎల్కతుర్తి వ్యవసాయ అధికారి పున్నం చందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా పామ్ ఆయిల్ తయారీ ప్రక్రియ, యంత్రాల వినియోగం, ఉత్పత్తి విధానం వంటి అంశాలతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతులపై రైతులకు వివరాలు తెలియజేశారు. పరిశ్రమలో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించిన రైతులు తమ వ్యవసాయంలో కూడా ఈ పద్ధతులను అనుసరించాలనే ఆసక్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీతో పాటు రైతులు దూకిరే బిక్షపతి, సుకినే గోపాలరావు, బూసారి వినయ్, కుడుతాడి రమేష్, హింగే శ్రీకాంత్, అంబీర్ చందర్ రావు, మదే రాములు, క్రాంతి కుమార్, మైస ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .